Amit Shah: బీజేపీ లోక్‌సభ ఎన్నికల సన్నాహాలు.. 13న నిజామాబాద్‌కు అమిత్ షా రాక

  • ఐదో తేదీన హైదరాబాద్‌లో తొలి క్లస్టర్ సమావేశం
  • షా పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
  • పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్యనేతలతో భేటీ కానున్న షా
బీజేపీ కేంద్ర నాయకత్వం లోక్‌సభ ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 13న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిజామాబాద్ రానున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నేతలు, శక్తికేంద్రాల ఇన్‌చార్జ్‌లతో ఆయన సమావేశం కానున్నారు.

ఐదో తేదీన హైదరాబాద్‌లో నిర్వహించే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి సెగ్మెంట్ల తొలి క్లస్టర్ సమావేశంలో అమిత్ షా పర్యటన ఏర్పాట్లను సమీక్షించనున్నట్టు పార్టీ రాష్ట్ర చీఫ్ కె.లక్ష్మణ్ తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
Amit Shah
BJP
K.Laxman
Nizamabad District
Hyderabad
Parliament elections

More Telugu News