Chandrababu: ఢిల్లీ టూర్‌లో చంద్రబాబు బిజీబిజీ.. కేజ్రీవాల్‌తో భేటీ

  • శుక్రవారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు
  • జాతీయ నాయకులతో వరుస భేటీలు
  • ఈవీఎంల పనితీరుపై ఎన్డీయే యేతర పక్షాల భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుస భేటీలతో తీరికలేకుండా ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న బాబు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై ఎన్డీయే యేతర పక్షాల భేటీలో పాల్గొన్నారు. కాన్సిస్ట్యూషన్ క్లబ్‌లో ‘సేవ్ ద నేషన్.. సేవ్ ద డెమోక్రసీ’ పేరుతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు సహా యూపీఏ భాగస్వామ్య పక్షాల నేతలు పాల్గొని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. దాదాపు అరగంటపాటు చర్చలు జరిపారు.  అయితే, ఏం మాట్లాడుకున్నారన్న విషయం బయటకు రాలేదు.
Chandrababu
Andhra Pradesh
New Delhi
Arvind Kejriwal
NDA
UPA

More Telugu News