అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్ల లబ్ధి నేరుగా చేకూర్చారు: రాహుల్ ఆరోపణలు
- ఎన్డీఏ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది
- నాలుగున్నరేళ్ళలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది
- ఈవీఎంల విషయమై ఈసీ అధికారులను కలుస్తాం
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఎన్డీఏ పాలనలో అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్ల లబ్ధి నేరుగా చేకూరిందని ఆరోపించారు. నాలుగున్నరేళ్ళలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈవీఎంల విషయమై ఎన్నికల సంఘం అధికారులను సోమవారం కలుస్తామని, ఓ డాక్యుమెంట్ ను వారికి అందజేస్తామని చెప్పారు. ఈవీఎంల పనితీరుపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా రాహుల్ ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని దుమ్మెత్తిపోశారు.