నెలకు రూ.100 కడితే.. జీవితాంతం రూ.3 వేల పెన్షన్.. కార్మికులకు కొత్త పథకం ప్రకటించిన కేంద్రం!
- ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ కు శ్రీకారం
- రూ.15వేలు, అంతకంటే తక్కువ జీతమున్నవారే అర్హులు
- పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన గోయల్
వీరంతా 60 ఏళ్ల వయసుకు చేరుకున్నాక నెలకు రూ.3,000 పెన్షన్ అందుకుంటారని వ్యాఖ్యానించారు. ఒకవేళ 29 ఏళ్ల వయసులోని వ్యక్తి ఈ పథకంలో చేరితే నెలకు రూ.100 కడితే సరిపోతుందన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందనీ, ఇందుకోసం ఇప్పటికే రూ.500 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ పథకంతో దాదాపు 10 కోట్ల మంది కార్మికులు, సిబ్బంది లబ్ధి పొందుతారని చెప్పారు.