క్రికెట్ వరల్డ్ కప్ దక్కేది ఈ రెండు జట్లలో ఒకరికే: డుప్లెసిస్ జోస్యం!
- ఇండియా లేదా ఇంగ్లండ్ గెలుస్తుంది
- మేము అంచనాలు లేకుండానే ఇంగ్లండ్ వెళుతున్నాం
- దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్
తమ జట్టులో యువరక్తం ఉందని, వారంతా వరల్డ్ కప్ లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారని, వారంతా ఆత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారని భావిస్తున్నానని చెప్పాడు. వరల్డ్ కప్ ను గెలుచుకుని రావాలన్న కోరికతో మాత్రం తాము ఇంగ్లండ్ కు వెళ్లడం లేదని డుప్లెసిస్ చెప్పాడు. గతంలో బలంగా కనిపించిన తమ జట్టు వరల్డ్ కప్ లో పలుమార్లు విఫలమైందని, ప్రస్తుతం ఇండియా, ఇంగ్లండ్ లతో పోలిస్తే, అంత బలమైన జట్టు కాదు కాబట్టి, భారీ అంచనాలను పెట్టుకోలేదని అన్నాడు. కాగా, 1992, 1999, 2007, 2015 సంవత్సరాల్లో సెమీస్ వరకూ వచ్చిన దక్షిణాఫ్రికా, ఒక్కసారి కూడా కప్ ను ముద్దాడలేదన్న సంగతి తెలిసిందే.