ఆ సన్నివేశాన్ని చూపించడానికి గట్స్ కావాలి.. అది కేవలం రాజమౌళికే సాధ్యం: సుమన్
- అసలైన హీరో ప్రభాస్ కాదు.. రానా
- చివరి వరకూ రానాదే పవర్ఫుల్ పాత్ర
- ప్రతినాయకుడి పాత్రను చంపడం సులువు కాదు
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘బాహుబలి’ సినిమాలో అసలైన హీరో ప్రభాస్ కాదు.. రానా. మీరు గమనించినట్లైతే క్లైమాక్స్‌లో ప్రభాస్ టచ్ చేయకుండానే రానా పాత్ర మంటల్లో పడి చనిపోతుంది. దీన్ని బట్టి చూస్తే సినిమా చివరి వరకు రానాదే పవర్ఫుల్ పాత్ర. సినిమాలో ఓ ప్రతినాయకుడి పాత్రను చంపడం అంత సులువు కాదు. ఆ సన్నివేశాన్ని చూపించడానికి గట్స్ కావాలి. అది కేవలం రాజమౌళికే సాధ్యమైంది. క్లైమాక్స్ వరకు ఓ హీరో 40 మంది రౌడీలను కొట్టడంలో పెద్ద విషయం ఏమీ లేదు’’ అని చెప్పుకొచ్చారు.