దిల్ రాజు బ్యానర్లో నాగచైతన్య

  • హిట్ కోసం చైతూ వెయిటింగ్
  • చేతిలో 'మజిలీ'.. 'వెంకీమామ'
  • కొత్త దర్శకుడితో మరో సినిమా  
'ప్రేమమ్' సినిమా తరువాత నాగచైతన్యకి హిట్ పడలేదు. 'శైలజా రెడ్డి అల్లుడు' .. 'సవ్యసాచి' సినిమాలపై ఆయన పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. దాంతో ఆయన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ప్రస్తుతం చేస్తోన్న 'మజిలీ' సినిమా తనకి హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వున్నాడు. తను .. సమంత కలిసి నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణ అవుతుందని ఆయన భావిస్తున్నాడు.

వెంకటేశ్ తో కలిసి 'వెంకీమామ' చేయడానికి సిద్ధమవుతోన్న ఆయన, మరో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడని సమాచారం. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. గతంలో దిల్ రాజు బ్యానర్లో చైతూ 'జోష్' సినిమా చేశాడు. మళ్లీ ఈ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందన్న మాట. ఆల్రెడీ స్క్రిప్ట్ ను లాక్ చేయడం జరిగిపోయిందనీ .. ఒక కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం కానున్నాడని అంటున్నారు.
Go Back to Shorts
chaitu
dil raju

More Telugu News