సందట్లో సడేమియా... ఎగ్జిబిషన్ లో దొరికినవి దొరికినట్టు దోచుకెళ్లిన సందర్శకులు!
- గత రాత్రి నుమాయిష్ లో ఘోర అగ్ని ప్రమాదం
- మంటలు వ్యాపిస్తుంటే దొరికిన వస్తువులను దోచుకెళ్లిన వందలాది మంది
- సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు
మంటలు వ్యాపిస్తున్న వేళ, ఏ షాపునకు మంటలు అంటుకున్నాయో ఆ షాపులో దోపిడీలు జరిగినట్టు తెలుస్తోంది. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన కొన్ని సీసీటీవీ కెమెరాల్లో ఈ విషయాలన్నీ రికార్డు అయ్యాయి. షాప్ కు ఓ వైపు మంటలు అంటుకోగా, దానిపై ఎగబడ్డ పదుల సంఖ్యలో ప్రజలు, చేతికి దొరికినదాన్ని దొరికినట్టు తమ వెంట తీసుకెళ్లారు. వీటిల్లో మిక్సీలు, ఫ్యాన్ల నుంచి చిన్న చిన్న ఎయిర్ కూలర్ల వరకూ ఉండటం గమనార్హం. ఈ నష్టమంతటినీ నుమాయిష్ నిర్వాహకులు భరించాల్సిందేనంటూ స్టాల్స్ యజమానులు ఇప్పుడు నిరసనలకు దిగుతున్నారు.