TRS: మూడో విడతలోనూ సత్తా చాటిన టీఆర్ఎస్ మద్దతుదారులు

  • 3,529 పంచాయతీలకు పోలింగ్
  • ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు
  • 88.03 శాతం పోలింగ్
మొదటి రెండు విడతల మాదిరిగానే మూడో విడతలోనూ తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగిన ఎన్నికల ప్రక్రియలో టీఆర్ఎస్ మద్దతుదారులే అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకున్నారు.

మూడో విడతలో 3,529 పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహించగా.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి టీఆర్ఎస్ 2320, కాంగ్రెస్‌ 869, టీడీపీ 12, బీజేపీ 52, సీపీఐ 19, సీపీఎం 20, ఇతరులు 451 స్థానాల్లో విజయం సాధించారు. మూడో దశలో 88.03 శాతం పోలింగ్ నమోదు కాగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 94.99 శాతం, జగిత్యాల జిల్లాలో అత్యల్పంగా 77.70శాతం పోలింగ్‌ నమోదైంది.
TRS
BJP
Telugudesam
Congress
Yadadri Bhuvanagiri District
Jagityal

More Telugu News