KA Paul: ఏపీ ఎన్నికల్లో గెలుపుపై కేఏ పాల్ ధీమా

  • క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదు
  • ఎన్నికలకు 90 రోజుల సమయం ఉంది
  • ఒక్కొక్కరూ వెయ్యి మందిని చేర్పించాలి
ఏపీలో ప్రజాశాంతి పార్టీ క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదని.. ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధీమాగా చెప్పారు. హైదరాబాద్‌లో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ లేదని.. టీడీపీ కారణంగా కాంగ్రెస్ భూస్థాపితమైందన్నారు. ఏపీలో ఎన్నికలకు మరో 90 రోజుల సమయం ఉందన్నారు. ఇప్పటికే 100 సీట్లలో తమ గెలుపు ఖాయమైందని.. గట్టిగా కృషి చేస్తే.. 175కి 175 సాధిస్తామన్నారు. ఒక్కొక్కరూ వెయ్యిమందిని పార్టీలో చేర్పించాలని కేఏ పాల్ సూచించారు. పార్టీ కమిటీలకు ఎవరినీ అధ్యక్షులుగా నియమించలేదన్నారు. అభ్యర్థులను కూడా ప్రకటించలేదన్నారు.
KA Paul
Telangana
Hyderabad
TRS
Congress
Telugudesam

More Telugu News