somu veerraju: కాపులకు రిజర్వేషన్లు కూడా మోదీ ఘనతే: సోము వీర్రాజు

  • కాపు రిజర్వేషన్లు మోదీ ఖాతాలోకే వెళ్లాలి
  • కేంద్రం సహకారం వల్లే రాష్ట్ర ప్రభుత్వం విజయాలు సాధించింది
  • 74 అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తోంది
ఈబీసీలకు కల్పించిన 10 శాతం కోటాలో 5 శాతాన్ని బీసీలకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బీజేపీ నేత సోము వీర్రాజు మాట్లాడుతూ... కాపు రిజర్వేషన్లు కూడా ప్రధాని మోదీ ఘనతే అని చెప్పారు. ఈ రిజర్వేషన్లు కూడా మోదీ ఖాతాలోకే వెళ్లాలని తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చుతామని చంద్రబాబు చెప్పారని... ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. బీసీ ఎఫ్ కేటగిరీ తీసుకొచ్చి ఉంటే ఆ ఘతన చంద్రబాబుదయ్యేదని చెప్పారు. కేంద్రం అందించిన సహకారం వల్లే రాష్ట్ర ప్రభుత్వం విజయాలను సాధించిందని చెప్పారు. 24 గంటల విద్యుత్తు సరఫరా కూడా కేంద్ర సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు. 74 అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తోందని చెప్పారు.
somu veerraju
kapu reservations
modi
Chandrababu
bjp
Telugudesam

More Telugu News