bhanupriaya: భానుప్రియను వెంటనే అరెస్ట్ చేయండి: డీజీపీని కోరిన బాలల హక్కుల సంఘం

  • బాలికను వేధిస్తున్నారంటూ భానుప్రియపై ఆరోపణలు
  • ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి
  • తాజాగా డీజీపీని కలిసిన బాలల హక్కుల సంఘం
సినీ నటి భానుప్రియ ఇంట్లో పని చేస్తున్న తన కూతురుని చిత్ర హింసలకు గురి చేస్తున్నారని... ఆమె సోదరుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై భానుప్రియ కూడా వివరణ ఇచ్చారు. బాలికను తాము వేధించలేదని, ఆమెను తన సోదరులు వేధించలేదని ఆమె తెలిపారు. మరోవైపు, భానుప్రియ ఇంటి నుంచి సదరు బాలిక కూడా తన ఇంటికి వెళ్లిపోయింది. తాజాగా ఈ వ్యవహారంపై బాలల హక్కుల సంఘం ఏపీ డీజీపీని కలిసింది. భానుప్రియను వెంటనే అరెస్ట్ చేశాలని కోరింది. 
bhanupriaya
tollywood
girl
harrassment
ap
dgp

More Telugu News