tmc: లోక్ సభ ఎన్నికల్లో 14 రాష్ట్రాల నుంచి పోటీ చేయనున్న మమతా బెనర్జీ పార్టీ

  • దూకుడు పెంచుతున్న టీఎంసీ
  • యునైటెడ్ ఇండియా ర్యాలీ విజయవంతం కావడంతో కొత్త ఉత్సాహంలో మమత పార్టీ
  • 2019లో బీజేపీ అంతం కావడం ఖాయమన్న డెరిక్ ఒబ్రెయిన్
పశ్చిమబెంగాల్ లో అధికారంలో ఉన్న మమతాబెనర్జీ పార్టీ టీఎంసీ దూకుడు పెంచుతోంది. ఇటీవల కోల్ కతాలో జరిగిన 'యునైటెడ్ ఇండియా' ర్యాలీ విజయవంతం కావడం... ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. దీంతో, పార్టీ పరిధిని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు సన్నాహకాలు చేస్తోంది. టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరిక్ ఒబ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల నుంచి పోటీ చేస్తామని చెప్పారు. 2019లో బీజేపీ అంతం కావడం ఖాయమని తెలిపారు. అయితే, ఆ 14 రాష్ట్రాలు ఏవనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. పశ్చిమబెంగాల్ లో మొత్తం 42 స్థానాల్లో పోటీ చేస్తామని ఒబ్రెయిన్ తెలిపారు.
tmc
mamata banerjee
derek o'beien

More Telugu News