Chandrababu: టీడీపీలో కోట్ల కుటుంబం చేరికపై స్పందించిన ఎంపీ బుట్టా రేణుక

  • ఎంపీ సీటు సూర్యప్రకాష్ రెడ్డికేనని ప్రచారం
  • టికెట్ల విషయం అధిష్ఠానం చూసుకుంటుంది
  • చంద్రబాబు అందరికీ న్యాయం చేస్తారు
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎంపీ బుట్టా రేణుకకు రానున్న ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ టికెట్ ఇస్తారని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీలో చేరిపోవడం, కర్నూలు ఎంపీ సీటు ఆయనకే ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో కోట్ల చేరికపై బుట్టా రేణుక ఎలా స్పందిస్తారా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తాజాగా ఈ విషయమై  ఆమె మాట్లాడుతూ.. టీడీపీలోకి ఎవరొచ్చినా.. పార్టీ బలోపేతమవుతుందన్నారు. టికెట్ల విషయం అధిష్ఠానం చూసుకుంటుందని.. అందరికీ న్యాయం చేసేలా చంద్రబాబు నిర్ణయం ఉంటుందని బుట్టా రేణుక స్పష్టం చేశారు.
Chandrababu
Butta Renuka
Kotla suryaprakash Reddy
Telugudesam
Kurnool

More Telugu News