నన్ను ఎవరూ తిట్టనందుకు సంతోషిస్తున్నా: నటుడు మనోజ్ బాజ్ పాయ్
- గతంలో అవార్డులు వస్తే సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసేవారు
- ఏ అర్హతతో అవార్డు ఇచ్చారంటూ విమర్శించేవారు
- ఈసారి నాకు అలాంటి అనుభవం ఎదురు కాలేదు
గతంలో ప్రభుత్వ అవార్డులు వచ్చినప్పుడు ఏ అర్హతతో అవార్డు ఇచ్చారని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసేవారని అన్నాడు. సదరు ఆర్టిస్టులు నటించిన పలు సినిమాను ప్రస్తావిస్తూ ఇష్టమొచ్చినట్టు విమర్శించేవారని తెలిపాడు. కానీ, ఈ సారి తనకు అలాంటి అనుభవం ఎదురు కాలేదని చెప్పాడు. రాత్రి నిద్రపోయే ముందు అనుపమ్ ఖేర్ తనకు ఫోన్ చేసి పద్మశ్రీ వచ్చినట్టు తెలిపారని... కాసేపు షాక్ లో ఉండిపోయానని తెలిపాడు. ఇంత గౌరవం తనకు దక్కుతుందని ఊహించలేదని చెప్పాడు.