ఆడపిల్లలను కిడ్నాప్ చేసి, క్షేమంగా వదిలివేస్తున్న వ్యక్తి... కారణం తెలుసుకుని పోలీసుల అవాక్కు!
- న్యూఢిల్లీలో వరుసగా బాలికల కిడ్నాప్
- సీసీటీవీ ఫుటేజ్ లు చూసి పట్టేసిన పోలీసులు
- అమ్మాయిలు లేకపోవడంతో ముచ్చట తీర్చుకుంటున్నానన్న వ్యక్తి
కృష్ణా తివారి... ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్స్ లో ఉండే వ్యక్తి. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అమ్మాయిలంటే తివారీకి చాలా ఇష్టం. తనకు ఆడ పిల్లలు లేరన్న కారణంతో, రోడ్డుపై కనిపించిన అమ్మాయిని, ఇంటికి తీసుకెళ్లి, ఆమెకు కావాల్సిన వన్నీ కొనిచ్చి, మరుసటి రోజు జాగ్రత్తగా అమెను ఇంటికి చేర్చేవాడు. కుమార్తెలు లేరన్న కారణంతోనే ఇలా బాలికలను తీసుకువచ్చి ముచ్చట తీర్చుకుంటున్నామని తివారీ పోలీసులకు చెప్పగా, కేసు నమోదు చేసిన పోలీసులు, మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.