Chandrababu: విమర్శించేవారిని చిత్తుగా ఓడించండి: చంద్రబాబు

  • డ్వాక్రా మహిళలను ఆదుకుంటాం
  • గ్యాస్ ఇస్తే అడ్డుకున్నారు
  • వచ్చే ఎన్నికల్లో సైన్యంలా పనిచేయాలి
విమర్శించేవారిని చిత్తుచిత్తుగా ఓడించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నేడు విశాఖలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలను అన్ని విధాలా ఆదుకుంటామని... వారికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.

ఒకప్పుడు గ్యాస్ ఇస్తే అడ్డుకున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో లక్షల మంది సైన్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లలకు సైకిళ్లిచ్చామని చంద్రబాబు తెలిపారు. మరుగుదొడ్లు కట్టి మహిళల ఆత్మగౌరవం కాపాడామని ఆయన స్పష్టం చేశారు. 94 లక్షల మంది మహిళలకు రూ.10 వేల చొప్పున రూ.9,400 కోట్లు ఇస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.
Chandrababu
Visakhapatnam
Cycles
Dwakra Women

More Telugu News