Bura Narasiah Goud: సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయి: ఎంపీ నర్సయ్యగౌడ్

  • ఏపీకి ఇచ్చిన నిధుల్లో సగం కూడా ఇవ్వలేదు
  • మోదీ సామాన్యులను ఇబ్బంది పెట్టారు
  • ప్రజలు బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మట్లేదు
ప్రధాని పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యులను ఇబ్బందిపెట్టారని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధుల్లో సగం కూడా తెలంగాణకు ఇవ్వలేదని.. అందుకే తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మడం లేదని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయని ఆయన జోస్యం చెప్పారు.

మొన్నటి వరకూ తమను నిందించిన చంద్రబాబు.. ఏపీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం లేదని విమర్శించారు. ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మట్లేదని ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని నర్సయ్య గౌడ్ అభిప్రాయ పడ్డారు. ఫెడరల్‌ స్పూర్తికి అనుగుణంగా ముందుకెళ్తున్న పార్టీలకు 100 నుంచి 150 సీట్లు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
Bura Narasiah Goud
TRS
Narendra Modi
Chandrababu
Congress
BJP

More Telugu News