బాబాయిపై పాటను విడుదల చేసిన రామ్ చరణ్!
- పాటను రూపొందించిన జనసేన
- జనసేన కార్యక్రమాలతో సాగే పాట
- దేశం కోసం పోరాడిన హీరోలకు అంకితం
‘69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పాటను దేశం కోసం పోరాడిన హీరోలకు అంకితం చేస్తున్నా. నా దృష్టిలో, లక్షలాది అభిమానుల దృష్టిలో, అంతకన్నా ఎక్కువ ఉండే జన సైనికుల దృష్టిలో బాబాయి ఎలా ఉంటాడో చెప్పే ఓ పాట ఇది.. దీన్ని విని స్ఫూర్తి పొందండి. జై హింద్’ అని చరణ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ పాటకు అటు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తల నుంచి మంచి స్పందన వస్తోంది.