కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడిచేసిన మరో ఎమ్మెల్యే గణేశ్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
- ఎమ్మెల్యే గణేశ్‌పై హత్యాయత్నం కేసు
- త్వరలోనే అరెస్ట్ చేస్తామన్న హోంమంత్రి
- చర్యలు తప్పవని హెచ్చరిక
ఎమ్మెల్యే గణేశ్ వ్యవహారంపై కర్ణాటక హోంమంత్రి ఎంబీ పాటిల్ మాట్లాడుతూ.. గణేశ్‌ను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. త్వరలోనే ఆయనను అరెస్ట్ చేస్తామని, ఎమ్మెల్యే కోసం పోలీసులు వెతుకుతున్నారని చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ క్రమ శిక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ తాము మాత్రం వదిలిపెట్టేది లేదని మంత్రి పేర్కొన్నారు.