Chandrababu: చంద్రబాబును నమ్మి ఏ పార్టీ పొత్తు పెట్టుకోదు: వైసీపీ నేత అంబటి రాంబాబు

  • కాపులను పావుల్లా ఉపయోగించుకునేందుకు యత్నం
  • రాజకీయ ప్రయోజనాల కోసమే కుల రిజర్వేషన్లు
  • ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు గిమ్మిక్కులు
ఏపీ సీఎం చంద్రబాబును నమ్మి పొత్తు పెట్టుకుంటే వెలుగు అనుకుని మంటల్లో పడినట్టేనని వైసీపీ నేత అంబటి రాంబాబు హెచ్చరించారు. నేడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును నమ్మి ఏ రాజకీయ పార్టీ పొత్తు పెట్టుకోదని అన్నారు.

ఎన్నికల్లో కాపులను పావుల్లా ఉపయోగించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కుల రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అంబటి ఆరోపించారు. ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు అనేక గిమ్మిక్కులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Chandrababu
Ambati Rambabu
YSRCP
Caste Reservations
Vijayawada

More Telugu News