TG Venkatesh: స్క్రోలింగ్‌లు చూసి విమర్శించడం సరికాదు: పవన్‌కు టీజీ వెంకటేష్ సూచన

  • వినకుండా విమర్శించడం సరికాదు
  • కార్యకర్తలకు ఆవేశం ఉంటుంది
  • నాయకులకు ఆవేశం పనికి రాదు
టీడీపీ-జనసేన కలిస్తే తప్పేంటన్న టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడిన సంగతి విదితమే. అయితే తాను ఏం మాట్లాడానో వినకుండా విమర్శించడం నాయకుడి లక్షణం కాదని టీజీ పేర్కొన్నారు. ఈ సాయంకాలం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తానేం మాట్లాడానో పూర్తిగా వినకుండా.. స్క్రోలింగ్‌లు చూసి విమర్శించడం సరికాదన్నారు. కార్యకర్తలకు ఆవేశం ఉంటుంది కానీ నాయకులకు ఆవేశం పనికిరాదన్నారు. ఏదైనా ఆవేశంతో కాకుండా ఆలోచించి మాట్లాడాలని టీజీ వెంకటేష్ సూచించారు.
TG Venkatesh
Pawan Kalyan
Telugudesam
Janasena

More Telugu News