Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిట్ మూవీ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్

  • తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్'
  • తెలుగు రీమేక్ దర్శకుడిగా రమేశ్ వర్మ
  •  త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు   
తెలుగు తెరపై మాస్ యాక్షన్ హీరోల రేసులో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తాడు. మొదటి నుంచి కూడా భారీ సినిమాలు చేసుకుంటూ వస్తోన్న ఆయన, మరో భారీ సినిమాకి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్' అనే సినిమాకి ఇది రీమేక్. తమిళంలో విష్ణు విశాల్ .. అమలా పాల్ జంటగా ఈ సినిమా నిర్మితమైంది. క్రితం ఏడాది అక్టోబర్లో వచ్చిన ఈ సినిమా హిట్ కొట్టేయడమే కాదు .. వైవిధ్యభరితమైన చిత్రంగా మార్కులు కొట్టేసింది.

సైకలాజికల్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమాను తమిళంలో రామ్ కుమార్ తెరకెక్కించాడు. తెలుగులో ఈ సినిమాకి రమేశ్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఆయన నుంచి 'వీర' .. 'రైడ్' సినిమాలు వచ్చాయి. ఇది బెల్లంకొండ శ్రీనివాస్ నటనను మరో కోణంలో ఆవిష్కరించే సినిమా అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం కథానాయికను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
bellamkonda srinivas

More Telugu News