Chandrababu: నా హత్యకు చంద్రబాబు-జగన్‌ కుట్రపన్నారు.. కాపాడండి మహాప్రభో!: హైదరాబాద్ సీపీని కలిసిన కేఏ పాల్

  • వీరిద్దరి నుంచి నాకు ప్రాణహాని ఉంది
  • యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లు నాపై అసత్య ప్రచారం చేస్తున్నాయి
  • వీరిపై కఠిన చర్యలు తీసుకోండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ ల నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. వారిద్దరూ తన హత్యకు కుట్ర పన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ను కలసి కోరారు.

పలు యూట్యూబ్ ఛానళ్లు, వెబ్ సైట్లు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, కామెడీ క్లిప్పింగులు వేస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వీటికి సంబంధించిన క్లిప్పింగులను కూడా పోలీస్ కమిషనర్ కు అందించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తం 100 యూట్యూబ్ చానళ్లు, కొన్ని వెబ్ సైట్లు, కొంతమంది వ్యక్తులపైన పాల్ ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కలుస్తానని చెప్పారు.
Chandrababu
jagan
ka paul
hyderabad
police
commissioner

More Telugu News