Big boss: కౌశల్‌ను విన్నర్‌గా ప్రకటించడం నానికి అస్సలు ఇష్టం లేదు: బాబు గోగినేని

  • సీజన్ 2ని వదలని కాంట్రవర్శీ
  • బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు
  • నాని ఎంతో ఆలోచించారన్న బాబు
‘బిగ్‌బాస్’ సీజన్ 1, 2లు పూర్తయ్యాయి. సీజన్ 3 కూడా త్వరలో ప్రారంభం కాబోతోందనే వార్తలు సర్వత్రా వినబడుతున్నాయి. కానీ సీజన్ 2 విషయంలో మొదలైన కాంట్రవర్శీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. హోస్ట్ నాని పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అవేమీ లేవంటూ నానియే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అయినా కూడా నానిని కాంట్రవర్శీ వెంటాడింది. తాజాగా బాబు గోగినేని ఆస్ట్రేలియాలో నాని, కౌశల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘బిగ్‌బాస్’ హౌస్‌లో కౌశల్‌కి వ్యతిరేకత ఏర్పడటం.. అది కాస్తా బయట అనుకూలంగా మారటం.. కౌశల్ ఆర్మీ ఏర్పడటం జరిగిపోయాయి. కౌశల్‌కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని ఇంటర్నెట్‌లో బాగా ట్రోల్ చేశారు. ఈ విషయంలో హోస్ట్ నానిని కూడా వదల్లేదు. ఈ ఒత్తిడి వల్లే నాని తనకు ఇష్టం లేకున్నా కౌశల్‌ను విన్నర్‌గా ప్రకటించాల్సి వచ్చిందని బాబు గోగినేని తెలిపారు. కౌశల్ సేన ఒత్తిడికి తలొగ్గి షో నిర్వాహకులు అతడినే విజేతని చేశారని... ఇది నానికి అస్సలు ఇష్టం లేదని.. అందుకే విజేతను ప్రకటించే సమయంలో ఆయన ఎంతో ఆలోచించారని బాబు తెలిపారు. కౌశల్ చేతిని నాని పట్టుకుని పైకెత్తలేదనేది బాబు వాదన. కౌశల్ న్యాయమైన విజేత కాదని స్పష్టం చేశారు.
Big boss
Nani
Babu Gogineni
Koushal
Australia

More Telugu News