kcr: ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన కేసీఆర్

  • కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కుమారుడి వివాహానికి వెళ్లిన కేసీఆర్
  • రాత్రికి మళ్లీ తిరుగుపయనం
  • రేపు ఉదయం యాగంలో పాల్గొననున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. తన ఫాంహౌస్ లో జరుగుతున్న రెండో రోజు యాగంలో పాల్గొని, హారతి పూర్తయిన తర్వాత... అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీలో ఈ రాత్రి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కుమారుడి వివాహం జరగనుంది. ఈ వేడుకకు కేసీఆర్ హాజరవుతున్నారు. ఇదే సమయంలో ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అనంతరం రాత్రికి ఢిల్లీ నుంచి తిరిగిపయనమవుతారు. రేపు ఉదయం జరిగే యాగంలో పాల్గొంటారు.
kcr
delhi
trip

More Telugu News