విజయనగరం జిల్లాలో విషాదం.. రైలు పట్టాలపై విగతజీవులుగా ప్రేమికులు
- యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయం
- బంధువుల ఇంటికొచ్చిన వధూవరులు
- సోమవారం పట్టాలపై శవాలుగా తేలిన ప్రేమికులు
పార్వతీపురం చేరుకున్న తర్వాత కాసేపటికే వధువు కృష్ణవేణి అదృశ్యమైంది. ఆమె కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులకు, బంధువులకు పెళ్లి కుమారుడు సమాచారం అందించాడు. అందరూ కలిసి గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోమవారం తెల్లవారుజామున ఓ జంట రైలు పట్టాలపై మృతి చెంది ఉండడాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి మృతులను చంద్రశేఖర్, కృష్ణవేణిగా గుర్తించారు. డిగ్రీ సెకండియర్ చదువుతున్న చంద్రశేఖర్ ఇటీవలే కానిస్టేబుల్ పరీక్ష రాశాడు. తమ ప్రేమ పెళ్లికి దారితీసే పరిస్థితులు కనిపించకపోవడంతోనే వీరు బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.