panchayt polls: సూర్యాపేట జిల్లాలో గుండెపోటుతో పోలింగ్ ఏజెంట్ మృతి

  • పోలింగ్ జరుగుతుండగా ఏజెంట్‌కు గుండెపోటు
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
  • ఆకులపాములలో ఘటన
తెలంగాణలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో విషాదం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ఆకులపాములలో పోలింగ్ జరుగుతుండగా ఓ ఏజెంట్ గుండెపోటుతో కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు కన్నుమూశాడు.  

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి పోలింగ్ ఏజెంట్‌గా విధులు నిర్వర్తించేందుకు గ్రామానికి చెందిన సత్యంరాజు (70) వెళ్లాడు. పోలింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా ఆయన గుండెపోటుతో అక్కడే కుప్పకూలాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతడిని కోదాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అతడి మృతితో  గ్రామంలో విషాదం నెలకొంది.
panchayt polls
Suryapet District
Akulapamula village
Telangana

More Telugu News