Chennai: చెన్నై నడిబొడ్డున దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే కత్తులతో యువకుడి నరికివేత

  • అరుంబాక్కంలో పట్టపగలే ఘటన
  • వెంటాడి మరీ చంపిన దుండగులు
  • భయభ్రాంతులకు గురైన జనం
చెన్నైలో కొందరు యువకులు పట్టపగలే దారుణానికి తెగబడ్డారు. రద్దీ రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని అత్యంత దారుణంగా నరికి చంపారు. కళ్లముందే జరుగుతున్న ఈ భయానక దృశ్యాన్ని అడ్డుకున్న ప్రయత్నం కానీ, పోలీసులకు సమాచారం ఇచ్చే సాహసం కానీ ఒక్కరు కూడా చేయకపోవడం గమనార్హం.  

అరుంబాక్కం ప్రాంతంలోని డీజీ వైష్ణవ కాలేజీ సమీపంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు ఓ వ్యక్తిని వెంటాడి వేటాడారు. యువకుడు భయంతో పరుగులు తీస్తుంటే వెంటాడి మరీ కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనను కొందరు వీడియోలు తీయగా, మరికొందరు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
Chennai
Tamil Nadu
Murder
arumbakkam
Crime News

More Telugu News