Nirmala: సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని వరించిన టాస్!

  • 2391 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం
  • జరపులతండాలో 169 చొప్పున ఓట్లు
  • నిర్మలకు అనుకూలంగా టాస్
తెలంగాణలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు భారీగా గెలుపొందారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే 2391 సర్పంచ్ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందగా.. 811 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నల్గొండ చింతపల్లి మండలం జరుపులతండాలో అనూహ్య పరిణామాల మధ్య విజయం టీఆర్ఎస్ అభ్యర్థినే వరించడం విశేషం. అక్కడ జరిగిన పోలింగ్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు 169 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేశారు. ఈ టాస్ టీఆర్ఎస్ అభ్యర్థి నిర్మలకు అనుకూలంగా పడటంతో అధికారులు ఆమెను సర్పంచ్‌గా నిర్ణయించారు.
Nirmala
TRS
Congress
Nalgonda District
Jarupula thanda

More Telugu News