‘జగన్ పై దాడి’ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. ఎన్ఐఏ విచారణపై స్టేకు నిరాకరించిన హైకోర్టు!
- మేం నిందితుడిని విచారించడం జరిగింది
- విచారణను దాదాపుగా పూర్తిచేశామన్న ప్రభుత్వం
- కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఎన్ఐఏ విచారణపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారంలో జనవరి 30లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లను తమకు అందజేయాలని ఎన్ఐఏ అధికారులకు సూచించారు.
కాగా, గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు జగన్ పై కోడి కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో లోతైన గాయం కావడంతో జగన్ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.