మేడా మల్లికార్జున రెడ్డికి చెక్.. ‘రెడ్ బస్’ చరణ్ రాజును తెరపైకి తెచ్చిన మంత్రి ఆదినారాయణ రెడ్డి!
- సీఎం రమేశ్ ను కలుసుకున్న చరణ్ రాజు
- రాజంపేటలో టీడీపీ తరఫున పోటీకి ఛాన్స్
- రేపు చంద్రబాబును కలుసుకోనున్న మేడా
రాజంపేటలో చరణ్ రాజును బరిలోకి దించాలని టీడీపీ అధినేతను కడప జిల్లా నేతలు కోరనున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ రాజు, ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు కడపలోని పొట్లదుర్తిలో టీడీపీ నేత సీఎం రమేశ్ ను కలుసుకున్నారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలకు సీఎం చంద్రబాబును రేపు కలుసుకుని వివరణ ఇస్తానని మేడా మల్లికార్జున రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. మేడాతో పాటు మిగిలిన జిల్లా టీడీపీ నేతలు కూడా చంద్రబాబుతో రేపు సమావేశం అవుతారు.