Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ సందేశం చూస్తావని ఆశిస్తున్నా.. ఒక్కసారి కాల్ చెయ్యి: అన్నయ్య కోసం పాయల్ రాజ్‌పుత్ ఎదురుచూపులు

  • నా సోదరుడు కనిపించక మూడేళ్లు
  • పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
  • మేమంతా నీ కోసం ఎదురు చూస్తున్నాం
మనతో బాగా అనుబంధం ఉన్న కుటుంబంలోని ఒక వ్యక్తి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కుటుంబం ఇలాంటి బాధనే అనుభవిస్తోందట. పాయల్ సోదరుడు ధృవ్ రాజ్‌పుత్(25)... 27 మార్చి 2016 నుంచి కనిపించటం లేదట. ఈ విషయాన్ని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదట. దీంతో చాలా బాధపడుతూ సోషల్ మీడియాలో పాయల్ పోస్ట్ పెట్టి.. తన సోదరుడి ఫోటోను షేర్ చేసింది.

‘‘నా సోదరుడు కనిపించట్లేదు! ఇది జరిగి మూడేళ్లు అవుతోంది. హ్యాపీ బర్త్ డే అన్నయ్య. నువ్వు ఈ సందేశం చూస్తావని ఆశిస్తున్నా. నువ్వు ఎక్కడైనా చిక్కుకు పోయి ఉంటే.. మాకు ఎలాగైనా ఒక్కసారి కాల్ చెయ్యి. మేమంతా నీకోసం ఎదురుచూస్తున్నాం. ఎన్నోసార్లు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాం. అయినా ప్రయోజనం లేదు’’ అని ట్వీట్ చేసిన పాయల్.. ‘ధృవ్‌ను కనిపెట్టండి’ అనే ట్యాగ్‌లైన్‌ను జత చేసింది.
Payal Rajputh
Dhruv
Mumbai Police
Social Media

More Telugu News