అనీశాతో పరిచయం, ప్రేమ గురించి వెల్లడించిన విశాల్

  • వైజాగ్‌లో అనీశా నన్ను కలిసింది
  • ‘మైఖేల్’ చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది 
  • ఆ సినిమా విడుదల చేసేందుకు అంగీకరించా
ప్రముఖ కథానాయకుడు విశాల్.. నటి అనీశాను ప్రేమ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇటీవల తమ ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అనీశాతో పరిచయం, ప్రేమ, ప్రపోజ్ చేయడం వంటి విషయాలను విశాల్ మీడియాతో పంచుకున్నాడు.

‘‘అయోగ్య’ సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వెళ్లినపుడు అనీశా తన స్నేహితులతో పాటు నన్ను కలవడానికి వచ్చింది. అప్పుడే ఆమెతో పరిచయం ఏర్పడింది. తాను ‘మైఖేల్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నానని తెలిపింది. ఆ సినిమా వ్యవసాయం నేపథ్యంలో సాగే సినిమా అని, యూనిట్‌కు చెందిన వారంతా వ్యవసాయదారులని చెప్పడంతో చిత్రాన్ని విడుదల చేసేందుకు నేను అంగీకరించాను. అనంతరం అనీశాను కొన్నిసార్లు కలిశాను. ఆ తర్వాత ఆమెపై ప్రేమ కలగడంతో ప్రపోజ్ చేశాను. ఆమె కాస్త సమయం తీసుకుని నా ప్రేమను అంగీకరించింది. అనీశా నటిగానే కాదు.. సామాజిక కార్యకర్తగా, బాస్కెట్ బాల్ క్రీడాకారిణిగా కూడా గుర్తింపు పొందింది’’ అని విశాల్ చెప్పుకొచ్చాడు.

Go Back to Shorts
Aneesha
Vishal
Social Media
Vizag
Micheal
Basket Ball

More Telugu News