'మణికర్ణిక' విజయాన్ని సాధించాలి .. కులదేవత ఆశీస్సులు తీసుకున్న కంగనా
- ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్రగా 'మణికర్ణిక'
- 180 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం
- ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు
ఈ నేపథ్యంలో కంగనా హిమాచల్ ప్రదేశ్ .. 'మండి' జిల్లాలోని తన స్వస్థలమైన 'దాబోయి'లోని తమ కుల దేవతను దర్శించుకున్నారు. మహిషాసుర మర్ధిని దేవాలయాన్ని దర్శించుకుని .. ప్రత్యేక పూజలు చేయించారు. తాను ఎంతో శ్రమించి నటించిన .. చిత్రీకరించిన 'మణికర్ణిక' ఘన విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుతూ అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. 180 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, తన కెరియర్లో చెప్పుకోదగిన సినిమా అవుతుందని ఆమె భావిస్తున్నారు.