పొరపాటున హెచ్ఐవీ బాధితురాలిగా మారిన గర్భిణి... ఆడబిడ్డ జననం, డాక్టర్లలో టెన్షన్!
- తమిళనాడులో తీవ్ర సంచలనం కలిగించిన ఘటన
- 9 మంది వైద్య బృందం పర్యవేక్షణలో నార్మల్ డెలివరీ
- 45 రోజుల తరువాత బిడ్డకు రక్త పరీక్ష
శివకాశి ప్రభుత్వ ఆసుపత్రిలో 19 సంవత్సరాల యువకుడు తనకు హెచ్ఐవీ సోకిందన్న విషయం తెలియకపోవడంతో రక్తదానం చేయగా, ఆసుపత్రి సిబ్బంది రక్తాన్ని పరీక్షించకుండానే బాధితురాలికి ఎక్కించారు. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన తరువాత మహిళా సంఘాలు, హైకోర్టు, తమిళనాడు సర్కారు స్పందించిన సంగతి తెలిసిందే. ఆమెకు రూ. కోటి పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.