kcr: ‘ఫెడరల్ ఫ్రంట్’కు ఆ రెండూ లేవు: ఏపీ మంత్రి సోమిరెడ్డి సెటైర్

  • కేసీఆర్, జగన్ లు మోదీ డైరెక్షన్ లో పనిచేస్తున్నారు
  • మోదీని కేసీఆర్, జగన్ ఎందుకు నిలదీయరు?
  • ఏపీ ప్రజలను కేసీఆర్ ఎంతగా తిట్టారు!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తానని చెబుతున్న ‘ఫెడరల్ ఫ్రంట్’కు ఫ్రంటూ బ్యాకూ రెండూ లేవని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు విసిరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్, జగన్ లిద్దరూ ప్రధాని మోదీ డైరెక్షన్ లో పనిచేస్తున్నారని తాము చెప్పిన విషయం నిజమైందని అన్నారు. రైతు సమస్యలపై  మోదీని కేసీఆర్, జగన్ ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను కేసీఆర్ ఎంతగా తిట్టారో ఎవరూ మర్చిపోరని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ప్రారంభించింది వైసీపీయేనని, వైసీపీ నేతలు జగన్, షర్మిళకు తెలంగాణ పోలీసులపై ఎందుకంత నమ్మకం? అని మంత్రి ప్రశ్నించారు. 
kcr
Telangana
somireddy
Jagan
modi

More Telugu News