Chandrababu: మేము చెబితే వినే నేతలు ఏపీలో ఉన్నారు: చంద్రబాబుకు తలసాని కౌంటర్

షార్ట్స్‌లో చూడండి
ఆలయాల దర్శనానికి వచ్చి ఇక్కడ రాజకీయాలు మాట్లాడటమేంటని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డ సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై తలసాని సీరియస్ అయాయరు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, చంద్రబాబులా తాము దొంగరాజకీయలు చేయబోమని అన్నారు. దేశంలో మంచి పాలన అందించేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

 ఏపీకి వెళ్లి తాను రాజకీయం చేశానని చంద్రబాబు అన్నారని... మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో మీరు చేసింది ఏమిటని ప్రశ్నించారు. తాము చిల్లర రాజకీయాలు చేయబోమని తలసాని అన్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నామని చంద్రబాబు ఆరోపించారని... ఇప్పుడు ఏపీలో కాని, అప్పుడు ఉమ్మడి ఏపీలో కానీ కులాల మధ్య చిచ్చుపెట్టింది చంద్రబాబేనని చెప్పారు. కాపులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు మళ్లీ వద్దు అని ఏపీ ప్రజలు తనకు చెప్పారని తెలిపారు. ఏపీలో కచ్చితంగా రాజకీయాలు చేస్తామని చెప్పారు. మేము చెబితే వినే నాయకులు ఏపీలో ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.
Go Back to Shorts
Chandrababu
talasani
Telugudesam
TRS

More Telugu News