Chandrababu: వీటన్నిటిపైనా సోషల్ మీడియాలో వైసీపీ దుష్ప్రచారం చేసింది: చంద్రబాబు

  • సోషల్ మీడియాను దుర్వినియోగం చేసింది వైసీపీనే
  • జేడీ లక్ష్మినారాయణ గురించి, పవన్ పెళ్లిళ్ల గురించి దుష్ప్రచారం చేసింది
  • చివరకు న్యాయమూర్తులపై కూడా తప్పుడు ప్రచారం చేసింది
సోషల్ మీడియా ద్వారా తనపై తప్పుడు వార్తలను టీడీపీ ప్రచారం చేస్తోందంటూ వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు మాట్లాడుతూ, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసింది వైసీపీనే అని మండిపడ్డారు.

జగన్ అవినీతిపై విచారణ జరిపిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణపై మొదట్లో ప్రచారం జరిపిందని అన్నారు. విచారణ జరపకుండా అడ్డుకునేందుకు ఈ కుట్రకు పాల్పడిందని చెప్పారు. దర్యాప్తు అధికారులు, చివరకు న్యాయమూర్తులపై కూడా దుష్ప్రచారం చేశారని విమర్శించారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై నీచమైన ప్రచారం చేశారని చెప్పారు. తన కుటుంబసభ్యులపై కూడా దుష్ప్రచారం చేశారని అన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిని ఉపేక్షించబోమని... అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Chandrababu
social media
Telugudesam
ysrcp

More Telugu News