Jagan: కేటీఆర్, జగన్ భేటీపై టీడీపీ వక్రభాష్యాలు చెబుతోంది: బొత్స సత్యనారాయణ

  • జగన్, కేటీఆర్ భేటీలో పొత్తుల ప్రస్తావన రాలేదు
  • 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం
  • టీడీపీ నేతల అబద్ధాల ప్రచారాన్ని నమ్మొద్దు
కేటీఆర్, జగన్ భేటీపై టీడీపీ వక్రభాష్యాలు చెబుతోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్, కేటీఆర్ భేటీలో పొత్తుల ప్రస్తావన రాలేదని, 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ హక్కుల కోసం పోరాడేందుకు వైసీపీ కట్టుబడి ఉందని, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే కలిశారని, ఇతర రాష్ట్ర నేతలను కలిసినట్టుగానే జగన్ ను టీఆర్ఎస్ నేతలు కలిశారని చెప్పారు. కేసీఆర్ తో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడలేదా? నందమూరి హరికృష్ణ భౌతికకాయం దగ్గర పొత్తు కోసం చంద్రబాబు చర్చించలేదా? అని ప్రశ్నించిన బొత్స, టీడీపీ నేతల అబద్ధాల ప్రచారాన్ని ఏపీ ప్రజలు నమ్మొద్దని కోరారు.
Jagan
KTR
botsa satyanarataba

More Telugu News