గుజరాత్‌లో నేటి నుంచే 'ఈబీసీ పది శాతం' కోటా అమలు.. తొలి రాష్ట్రంగా రికార్డు!
- ప్రకటించిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ
- విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్
- ఇటీవలే చట్టంగా మారిన బిల్లు
త్వరలో భర్తీ చేయనున్న ప్రభుత్వ ఉద్యోగాలతోటు విద్యాసంస్థల్లోనూ ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్ కల్పిస్తామని పేర్కొన్నారు. ఫలితంగా ఈ చట్టాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా గుజరాత్ రికార్డులకెక్కనుంది. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఈ బిల్లు లోక్‌సభ, రాజ్యసభల్లో పెద్దగా అడ్డంకులు లేకుండానే ఆమోదం పొందింది. ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లును రెండు రోజుల క్రితం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించడంతో చట్టంగా మారింది.