Kamal Haasan: రజనీకాంత్, కమలహాసన్ నా స్నేహితులు కాదు: శరత్ కుమార్

  • వారిద్దరూ సహనటులు మాత్రమే
  • వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తా
  • రజనీ, కమల్ తో కలిసేది లేదన్న శరత్ కుమార్
దక్షిణాది స్టార్ హీరోలు రజనీకాంత్, కమలహాసన్ లు తన స్నేహితులేమీ కాదని ప్రముఖ నటుడు శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరుగుతున్న పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ఆయన, మీడియాతో మాట్లాడారు. వారిద్దరూ తన సహ నటులు మాత్రమేనని అన్నారు.

 సినీ పరిశ్రమలో తనకు మిత్రులు చాలా తక్కువమందే ఉన్నారని చెప్పిన శరత్ కుమార్, ఈ సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ పడాలని భావిస్తున్నట్టు చెప్పారు. తన పార్టీ నేతలు కోరితే పోటీ చేస్తానని చెప్పారు. రజనీకాంత్, కమలహాసన్ లు లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దిగితే, వారితో తాను కలిసి పని చేసేది లేదని, ఇదే సమయంలో విజయ్ కాంత్ ఆహ్వానిస్తే మాత్రం ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నానని శరత్ కుమార్ వెల్లడించారు.
Kamal Haasan
Rajanikant
Sharat Kumar
Tamilnadu
Lok Sabha

More Telugu News