China Women: టీ20 క్రికెట్‌లో చైనా మహిళల జట్టు సరికొత్త చెత్త రికార్డు!

  • దుబాయ్‌లో థాయలాండ్ మహిళల టీ20 స్మాష్
  • 189 పరుగుల తేడాతో విజయం సాధించిన యూఏఈ
  • 14 పరుగులకే అవుటైన చైనా
టీ20 క్రికెట్‌లో చైనా మహిళల జట్టు అత్యంత చెత్త రికార్డును లిఖించింది. ‘థాయ్‌లాండ్ మహిళ టీ20 స్మాష్’ టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్‌లో యూఏఈ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చైనా జట్టు పది ఓవర్లలో కేవలం 14 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 పురుషుల, మహిళల క్రికెట్‌లో అత్యంత తక్కువ స్కోరు ఇదే.

ఏడుగురు చైనా బ్యాట్స్ విమెన్‌లలో ఏడుగురు డకౌట్ అయ్యారు. ఒకరు మాత్రం 12 బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేశారు. జట్టులో అదే టాప్ స్కోరు. ఈ మ్యాచ్‌లో యూఏఈ జట్టు 189 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా యూఏఈ మహిళల జట్టు రికార్డులకెక్కింది.  గతేడాది ఆగస్టులో లెసోతో జట్టుపై నమీబియా 179 పరుగుల తేడాతో ఓడింది. ఇప్పుడా రికార్డును చైనా బద్దలుగొట్టింది.
China Women
Cricket
T20
Thailand Women’s T20 Smash
UAE

More Telugu News