పోలీసులకు షాక్ ఇచ్చిన నిందితుడు.. లింగ నిర్ధారణ కోసం ఆసుపత్రికి తరలింపు!
- లింగ మార్పిడి చేయించుకున్నాని వెల్లడి
- తన పేరును షాభిన అస్మిగా పేర్కొన్న నిందితుడు
- పరీక్షలు జరిపి నివేదిక ఇవ్వాలని కోరిన పోలీసులు
తాను మూడేళ్ల క్రితం లింగ మార్పిడి చేయించుకున్నానని.. తన పేరు హుస్సేన్ కాదని.. షాభిన అస్మి అని.. తనది కరీంనగర్ జిల్లా ఫతేపూర్ అని పోలీసులకు చెప్పడంతో వారు కంగుతిన్నారు. దీంతో అసలు ఆ వ్యక్తి ఆడా? మగా? నిర్ధారణ కోసం అతనిని పంపుతూ, గాంధీ ఆసుపత్రికి లేఖ రాశారు. షాభిన అస్మి అలియాస్ సయ్యద్ సిరాజ్ హుస్సేన్‌కు వైద్య పరీక్షలు జరిపి నివేదిక ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. వైద్యుల నుంచి స్పష్టత వస్తే కానీ జెండర్ కాలమ్ నింపి.. చీటింగ్ కేసును పోలీసులు ఓ కొలిక్కి తీసుకురానున్నారు.