Amarnath Reddy: చంద్రబాబును తిట్టిపోయడానికే జగన్ పాదయాత్ర: మంత్రి అమరనాథ్‌రెడ్డి
- చంద్రబాబుతో జగన్‌కు పోలికే లేదు
- త్వరలో బస్సు యాత్ర చేయబోతున్నారట
- ఎన్నికలు ముగిశాక కాశీయాత్రే...
ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత పాదయాత్రను అంతా మరచిపోయారని.. అందుకే పైలాన్‌ను ఆవిష్కరించి తిరిగి గుర్తు చేశారని ఏపీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నేడు ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తే.. జగన్ చంద్రబాబును తిట్టేందుకే పాదయాత్ర చేశారని ఆరోపించారు. 63 ఏళ్ల వయసులో చంద్రబాబు చేసిన పాదయాత్రకు.. జగన్ పాదయాత్రకు పోలికే లేదని విమర్శించారు.
ఇప్పుడైతే జగన్ పాదయాత్ర ముగిసిందని, త్వరలో బస్సు యాత్ర చేయబోతున్నారని, ఎన్నికలు ముగిశాక ఇక కాశీయాత్రకు సన్నాహాలు చేసుకుంటారని అమర్‌నాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమాన్ని మరచిన వైసీపీ నేతలు ప్రోటోకాల్ పేరుతో రాద్ధాంతం చేశారని విమర్శించారు. మోదీ ఏమని భయపెట్టారో తెలియదు కానీ జగన్ వణికిపోతున్నారని, ఎక్కడ మోదీని తిట్టాల్సి వస్తుందోనని వైసీపీ ఎంపీలు పార్లమెంటుకు వెళ్లడమే మానేశారని అన్నారు.