vajpayee: వాజ్ పేయి ఎక్కడ, మోదీ ఎక్కడ.. మోదీ ఎప్పటికీ వాజ్ పేయి కాలేరు!: డీఎంకే అధినేత స్టాలిన్

  • వాజ్ పేయి హయాంలో ఎన్డీయే మంచి మనసుతో పని చేసింది
  • మోదీ సర్కారు రాష్ట్రాల హక్కులను అణగదొక్కుతోంది
  • మోదీ నాయకత్వంలోని కూటమి దేశానికి మంచిది కాదు
దివంగత ప్రధాని వాజ్ పేయితో ప్రధాని మోదీ పోల్చుకోవడం హాస్యాస్పదమని డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. వాజ్ పేయి ఎక్కడ, మోదీ ఎక్కడ? అంటూ ఎద్దేవా చేశారు. మోదీ ఎప్పటికీ వాజ్ పేయి కాలేరని అన్నారు. వాజ్ పేయి హయాంలో ఎన్డీయే మంచి మనసుతో పని చేసిందని... మోదీ సర్కారు రాష్ట్రాల హక్కులను అణగదొక్కుతోందని విమర్శించారు.

విభజన రాజకీయాలకు వాజ్ పేయి ఎన్నడూ ప్రయత్నించలేదని చెప్పారు. ప్రాంతీయ పార్టీలను వాజ్ పేయి కలుపుకుని పోయారని... ప్రస్తుత బీజేపీలో వాజ్ పేయిలాంటి నాయకత్వం లేదని తెలిపారు. బీజేపీతో డీఎంకే పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో కూటమి ఏర్పడటం దేశానికి మంచిది కాదని చెప్పారు. 1999 ఎన్నికల్లో బీజేపీ, డీఎంకేలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.
vajpayee
modi
stalin
dmk
bjp

More Telugu News