సినిమా మహాద్భుతంగా ఉంది.. మహానాయకుడి కోసం ఎదురుచూస్తున్నా: మహేశ్ బాబు

  • వెండితెర కాన్వాస్‌పై క్రిష్ అద్భుతం
  • బాలకృష్ణ జీవించారు
  • ఎన్టీఆర్‌కు గొప్ప నివాళి
దివంగత ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘ఎన్టీఆర్ కథనాయకుడు’ సినిమాపై  సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమా మహాద్భుతంగా ఉందని కొనియాడాడు. ఎన్టీఆర్‌కు ఈ స్థాయిలో ఇప్పటి వరకు ఎవరూ నివాళులు అర్పించలేదన్నాడు. ఇది నిస్సందేహంగా గొప్ప నివాళి అని పేర్కొన్నాడు.

ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ జీవించారని, దర్శకుడు క్రిష్ వెండితెర కాన్వాస్‌పై అద్భుతం చేశాడని మహేశ్ బాబు ప్రశంసించాడు. మహానటుడి జీవితం గురించి ఎవరికీ తెలియని విషయాలను అందంగా చిత్రీకరించి ప్రపంచానికి తెలియజేశారన్నాడు. ‘బ్రిలియంట్’ అని క్రిష్‌ను ఆకాశానికెత్తేశాడు. దీనికంటే ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ మరింత అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నానని, దాని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్న మహేశ్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపాడు.
Go Back to Shorts
NTR
NTR kathanayakudu
Mahesh Babu
Tollywood
Krish
Director

More Telugu News