రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే.. న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదు: సుప్రీం తీర్పుపై యనమల
- మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టు
- దర్యాప్తు సంస్థలను సొంతానికి వాడుకున్నారు
- వ్యక్తిగత స్వేచ్ఛను హరించాలని చూస్తే ఊరుకోరు
మోదీ సొంతానికి దర్యాప్తు సంస్థలను వాడుకున్నారని యనమల ఆరోపించారు. నాడు తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించి.. నేడు ఈబీసీలపై కపట ప్రేమ చూపుతున్నారని.. దీని వెనుక రాజకీయ రహస్యమేంటని ప్రశ్నించారు. రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది.. రైతు రుణమాఫీ అంశాన్ని దృష్టి మరల్చేందుకేనని యనమల ఆరోపించారు. వ్యక్తిగత స్వేచ్ఛను మోదీ ప్రభుత్వం హరించాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.