New Delhi: నేడు రాహుల్ గాంధీని కలవనున్న చంద్రబాబు!

  • నేడు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
  • అగ్రవర్ణాలకు రిజర్వేషన్లపై రాహుల్ తో చర్చలు
  • పలు జాతీయ నేతలను కలవనున్న బాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన బీజేపీయేతర పార్టీల నేతలను కలుస్తారని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ అవుతారని, అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ల అంశం సహా, పలు కీలకాంశాలపై వీరి మధ్య చర్చ జరుగుతుందని తెలుస్తోంది.

ఇంకా మాయావతి, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, దేవెగౌడ, సీతారాం ఏచూరి తదితరులతో బాబు సమావేశం కానున్నారని సమాచారం. కూటమి విధివిధానాలు, భవిష్యత్ విధివిధానాలపై వీరి మధ్య చర్చ జరుగుతుందని, తెలుగుదేశం పార్టీ ఎంపీలతోనూ చంద్రబాబు భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంతో పోరాటం చేసే విషయంలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారని అన్నారు.
New Delhi
Chandrababu
Rahul Gandhi
Mayawati

More Telugu News