India: రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మోదీకి ఫోన్ చేశారు!

  • పలు అంతర్జాతీయ అంశాలపై చర్చ
  • ఈస్ట్రన్ ఎకనామిక్ సదస్సుకు రావాలని మోదీకి ఆహ్వానం
  • సానుకూలంగా స్పందించిన భారత ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. వీరిద్దరూ పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించినట్టు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రధానంగా రక్షణరంగం, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలపై వీరిమధ్య చర్చ సాగిందని తెలిపింది.

ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్ వంటి ప్రపంచ వేదికలపై పరస్పర సహకారాన్ని కొనసాగించాలని ఇరు దేశాధినేతలూ నిర్ణయించారని వెల్లడించింది. రష్యాలో సెప్టెంబర్ లో జరగనున్న ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు హాజరు కావాలని కోరేందుకు పుతిన్ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. సదస్సుకు హాజరుకావాలన్న పుతిన్ విజ్ఞప్తిపై నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారని విదేశాంగ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
India
Russia
Narendra Modi
Putin

More Telugu News